Home » Police case
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మైసూరులో గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
TGCSB: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు అరెస్టు చేశారు. మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు బృందాలు రెక్కీ నిర్వహించి వారిని అరెస్టు చేసినట్టు సీఎస్‌బీ డీజీ ప్రకటించారు.
Road Accident: ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా రోడ్దు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్‌ను పోలీసులు A-2గా చేర్చారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏజెంట్, నిర్వాహకుడు నాయక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాబాలు దేవుడు, పూజలపై విపరీతమైన నమ్మకం ఉన్నవారినే వారు టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. మెల్లగా వారి ముగ్గులో దింపుతారు. మీకు జీవితంలో ఇలా జరిగింది, అలా జరగబోతుందని మాయ మాటులు చెబుతారు. ఆ పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని.. లేకపోతే ఇంటికి అరిష్టమని చెబుతూ గట్టిగా నమ్మిస్తారు. దీంతో అమాయక ప్రజలు వారి మాయలో పడి మోసపోతుంటారు.
సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్‌లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని..
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ అనే వ్యక్తి మియాపూర్‌లో కాపురం పెట్టి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్య, భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భార్య, అత్తపై మహేష్ కత్తితో దాడి చేశాడు.