Home » PM Modi
అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్‌లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ స్టాక్‌ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఒడిశాలో 2024 జూన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
బిహార్ ఎన్డీయే ప్రభుత్వం చొరవతో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం ప్రారంభమైంది. మహిళా సాధికారికత కోసం స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు.
ప్రధాని మోదీ రాజస్థాన్‌లో రూ.1,22,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు గురువారం నాడు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు.
ప్రధాని జన్ ధన్ ఖాతాలు తెరిపించి బ్యాంకులకు చేరువ చేశారని.. దిక్కు లేని వారికి మోదీ దిక్కయ్యారని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. 4 కోట్ల మందికి ఆవాసం నిర్మించారన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపు నవ్వులు పూయించారు. సీరియస్‌గా నడుస్తున్న సభలో తన వాక్చాతుర్యంతో సందడి చేశారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్‌రావు గుర్తుచేశారు.
సాంకేతిక విధానాన్ని పరిపాలన పద్ధతుల్లో వినియోగించడంతో అవినీతికి ఆస్కారం ఉండదని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పూర్తవుతుందని జితేందర్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.