PM Modi: కాంగ్రెస్‌లో త్వరలో చీలిక.. మోదీ బిగ్ అనౌన్స్‌మెంట్
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:39 PM
కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌ను తప్పుపడుతోందని, తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని, ఓట్ చోరీ వంటి నిరాధార అంశాలను లేవనెత్తుతూ ప్రజలను కులం, మతం పేరుతో విభజిస్తోందని ప్రధాని విమర్శించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో మరోసారి చీలిక వచ్చే అవకాశం ఉందని ప్రధానమంత్రి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ భాగస్వామ్యలు ఈ విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు. బిహార్‌లో ఎన్డీయే మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలుచుకుని రికార్డు స్థాయి విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాని శుక్రవారం సాయంత్రం మాట్లాడారు.
కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌ను తప్పుపడుతోందని, తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని, ఓట్ చోరీ వంటి నిరాధార అంశాలను లేవనెత్తుతూ ప్రజలను కులం, మతం పేరుతో విభజిస్తోందని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల సానుకూల విజన్ లేదన్నారు. అదొక ముస్లింలీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ (ఎంఎంసీ)లా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ఎజెండా మొత్తం ఈ అంశంపైనే నడుస్తోందని అన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌లో ఒక కొత్త బ్రాంచ్ ఆవిర్భవించబోతోందని, అది కాంగ్రెస్ నెగిటివ్ పాలిటిక్స్ కంటే కూడా దారుణంగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నెగిటివ్ పాలిటిక్స్‌పై ఆ పార్టీ మిత్రులు, మద్దతుదారుల్లో కూడా ఆలోచన మొదలైందని, కాంగ్రెస్ తనకు తాను మునగడంతో పాటు తమందరినీ ముంచేస్తుందనే ఆందోళనలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జైలుకు వెళ్లినా.. 28,000 ఆధిక్యంతో గెలుపు..
ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..