Home » Pahalgam Terror Attack
Pahalgam Terror Attack: ఉగ్రదాడి గురించి తెలియని చాలా మంది ఎంతో ప్రశాంతంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మరికొంతమంది షాపుల దగ్గర నిల్చుని ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి పోయిన వారు ఎందుకలా చేశారో కూడా వారికి అర్థంకాలేదు.
ఆదివారంనాడిక్కడ జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్‌లో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్కింగ్ స్టయిల్, దృఢ సంకల్పం అందరికీ తెలిసిందనేనని, మోదీ నాయకత్వంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందని అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కు లీగల్ అడ్వయిజర్‌గా, పార్టీ ప్రతినిధిగా కూడా అఫ్జల్ ఖాన్ ఉన్నారు. యుద్ధం అంటూ మొదలైతే ఆయుధం పట్టి కదనరంగంలోకి వెళ్తారా అని ఒక పాత్రికేయుడు అఫ్జల్ ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
పహల్గాం దాడి అనంతరం పాక్‌పై దెబ్బకు దెబ్బ తీయాలనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. భారత్ సైతం పాక్‌పై వరుస కఠిన చర్యలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా (ఓఎఫ్‌కే) తమ అధికారులు, ఉద్యోగులకు రెండు రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం
Bangladesh Ex Army Officer: బంగ్లాదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫజూర్ రెహ్మాన్ తల పొగరు కామెంట్లు చేశారు. పహల్గామ్ విషయంలో భారత్ .. పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తాము ఇండియాపై దాడి చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది.
CRPF Constable: టూరిస్టు వీసా ద్వారా ఇండియాలోకి వచ్చిన అప్పటినుంచి మునాల్, అహ్మద్ కలిసే ఉంటున్నారు. వీసా తేదీ మార్చి 22తో ముగిసిపోయింది. అయినప్పటికి మునాల్ ఇక్కడే ఉంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకీస్తానీల వీసాలు రద్దు చేయటంతో మునాల్ విషయం వెలుగులోకి వచ్చింది.
Pahalgam Terror Attack: వారు శ్రీలంక ఎయిర్ లైన్స్‌కు చెందిన యూఎల్ 122 విమానంలో చెన్నైనుంచి శ్రీలంకకు వెళుతున్నట్లు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ అధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే అలర్ట్ అయ్యారు.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటి వరకు కొనసాగిన సంబంధాలన్నీ క్షీణించాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్గతంగా ఉగ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్న భారత్.. మరోవైపు, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పైనా..