Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. వెలుగులోకి మరో వీడియో..
ABN , Publish Date - May 04 , 2025 | 09:07 PM
Pahalgam Terror Attack: ఉగ్రదాడి గురించి తెలియని చాలా మంది ఎంతో ప్రశాంతంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మరికొంతమంది షాపుల దగ్గర నిల్చుని ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి పోయిన వారు ఎందుకలా చేశారో కూడా వారికి అర్థంకాలేదు.
జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22 వ తేదీన ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంజాయ్ చేయడానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డాడు. ముస్లింలా కాదా తెలుసుకుని మరీ పర్యాటకుల్ని చంపేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో 25 మంది ఇండియా వారు కాగా.. ఓ వ్యక్తిది నేపాల్. ఉగ్రదాడి జరిగిన గంటల్లోనే అందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని వీడియోలు చూసే వారిని కలవరపరిచే విధంగా ఉన్నాయి.
తాజాగా, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న మార్కెట్ ఏరియాకు సంబంధించిన వీడియో అది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని తెలియగానే కొంతమంది మహిళలు, పిల్లలు రోడ్డుపై పరుగులు పెట్టారు. ఉగ్రదాడి గురించి తెలియని చాలా మంది ఎంతో ప్రశాంతంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మరికొంతమంది షాపుల దగ్గర నిల్చుని ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి పోయిన వారు ఎందుకలా చేశారో కూడా వారికి అర్థంకాలేదు.
పాక్ గుండె దడ
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతి నుంచి భారత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పాకిస్తాన్ నాయకుల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారత్ ఎప్పుడు యుద్దానికి దిగుతుందోనని భయపడి చస్తున్నారు. కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోతామంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. భూభాగంతో పాటు నీటిపై కూడా భారత్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ విషయం తెలియగానే పాక్ కూడా యుద్దానికి సిద్ధమవటం మొదలెట్టింది. అయితే, భారత్ మాత్రం ఆర్థికంగా పాకిస్తాన్‌ను దెబ్బ తీయాలని చూస్తోంది. అన్ని రకాల ఎగుమతులు, దిగుమతులను పాకిస్తాన్ నుంచి ఆపేసింది.
ఇవి కూడా చదవండి
Viral Vide: ఓసీ పిల్ల నక్కా.. సింహంతో ఆటలా..
Nani Head Injury: నాని తలకు గాయం.. అయినా షూటింగ్ ఆపలేదు..