Home » Operation Sindoor
పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత దేశ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసే సత్తా భారత్‌కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ డీకున్హా అన్నారు. మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని మార్చినా ఉపయోగం ఉండదని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అభినందించాల్సింది పోయి రాహుల్ గాంధీ పాకిస్థాన్ చెబుతున్న అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
తమ చొరవతోనే భారత్-పాక్ కాల్పుల విరమించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడాన్ని విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు. ద్వైపాక్షిక స్థాయిలో చర్చలు జరిగిన అనంతరమే మిలటరీ యాక్షన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా దాడులను ఖండిస్తూ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయాలని అంతా భావించినట్టు శశిథరూర్ చెప్పారు. అయితే మిస్రీ అందుకు నిరాకరించారని తెలిపారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ పావుగా వాడుకుందని తెలుస్తోంది. కొత్త తరహా యుద్ధం కోసం ఆమెను ఆయుధంగా ఉపయోగించుకుందట శత్రుదేశం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై దాడికి ముందే ఆ దేశానికి సమాచారం ఇవ్వడం నేరమని, భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం ఇప్పుడు దేశం మొత్తాన్ని షేక్ చేస్తోంది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ మన ఆర్మీకి సంబంధించిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేసిన జ్యోతి కేసులో ఒక్కొక్కటిగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి కున్వర్ విజయ్ షా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఒక రకంగా చెప్పాలంటే, చాకిరేవుపెట్టి ఉతికారేసింది.