Share News

Jyoti Malhotra Chats Deleted: ఛీ .. ఛీ .. నువ్వు ఆడదానివేనా.. జ్యోతి మల్హోత్రాపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - May 20 , 2025 | 02:30 PM

జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత్ ప్రతికారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సిందూర్‌ గురించిన ప్రతి విషయాన్ని డానిష్‌తో చాటింగ్ ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..

Jyoti Malhotra Chats Deleted: ఛీ .. ఛీ .. నువ్వు ఆడదానివేనా.. జ్యోతి మల్హోత్రాపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు..
Jyoti malhotra

Jyoti Malhotra Chats Deleted: హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్‌తో ఆపరేషన్ సిందూర్ గురించి చేసిన చాటింగ్‌ మల్హోత్రా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన డిజిటల్ ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని మినిట్ టూ మినిట్ చాటింగ్ ద్వారా డానిష్‌‌కు తెలిపేదని, అనంతరం ఆ చాటింగ్ హిస్టరీని తొలగించిందని తెలుస్తోంది. తన మొబైల్ ఫోన్‌లో ఇతర కీలకమైన ఆధారాలను డిలీట్ చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి దేశమంతా ప్రశంసలు కురిపిస్తుంటే, ఆమె మాత్రం ఈ విషయాలను డానిష్‌కు తెలిపేదని తెలుస్తోంది.


సాక్ష్యాలు లేకుండా..

చాట్‌లలో ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలను షేర్ చేసిందని, హిసార్‌లో బ్లాక్‌అవుట్ సమయం గురించి, అలాగే బ్లాక్‌అవుట్ సమయంలో పరిపాలనా కార్యకలాపాల గురించి, అధికారుల నుండి సైరన్‌లు, అధికారిక సందేశాల గురించి డానిష్‌కు ప్రతీదీ తెలియజేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ చాటింగ్ అంతా తన ఫోన్‌లో డిలీట్ చేసి సాక్ష్యాలు లేకుండా అధికారులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది. కానీ, అధికారులు ఆమెకున్న రెండు ఫోన్ లను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందడానికి వాటిని ఫోరెన్సిక్ అధికారులకు పంపారు.


సంచలన విషయాలు

కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్నకొద్ది ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌లో జ్యోతి కార్యకలాపాలు సాంస్కృతిక లేదా మతపరమైన పర్యాటక రంగానికి మించి ఉన్నాయని విచారణలో తేలింది. ఆమె వీడియోలు మతపరమైన కంటెంట్‌గా ఉన్నప్పట్టికీ, వీడియోలు మాత్రం మతపరమైన ప్రదేశాల గురించి తక్కువ సమాచారాన్ని ఇస్తున్నాయి. ఎక్కువగా సరిహద్దు ప్రాంతాలు, వాటి భద్రతా ఏర్పాట్లపై జ్యోతి దృష్టి సారించినట్లు వీడియోలలో కనిపిస్తోంది.

జ్యోతి.. పాకిస్తాన్ పర్యటన తర్వాత చేసిన బంగ్లాదేశ్, చైనా పర్యటనలకు సంబంధించిన వీడియోలను దర్యాప్తు బృందం అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మే 17, 2014న బైసాఖి పండుగ కోసం జ్యోతి పాకిస్తాన్‌కు వెళ్లింది. ఈ పండుగ పది రోజులు కొనసాగినప్పటికీ, ఆమె 20 రోజులకు పైగా పాకిస్తాన్‌లోనే ఉండి, దాదాపు ఒక నెల పాటు చైనాకు వెళ్లింది. పండుగ తర్వాత ఆమె పాకిస్తాన్‌లో ఎక్కడికి వెళ్లింది? ఎవరిని కలిసింది? ఆమె చైనా పర్యటన అక్కడ ముందే నిర్ణయించబడిందా అని ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.


ఛీ.. ఛీ

ఏది ఏమైనా జ్యోతి మల్హోత్రాపై నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత్ ప్రతికారం తీర్చుకున్నందుకు ఒక స్త్రీగా సంతోషించాల్సింది పోయి బదులుగా పాకిస్తాన్ అధికారులకు చాటింగ్ లలో అందుకు సంబంధించిన విషయాలు చేరవేయడంతో ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఛీ.. ఛీ.. నువ్వు ఆడదానివేనా.. నీలాంటి వారి వల్లే మన దేశంలో భద్రత అనేది లేకుండా పోయిందని ఫైర్ అవుతున్నారు.


Also Read:

Operation Sindoor: పఠాన్ ఔట్.. అభిషేక్ ఇన్

Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్‎డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..

Chief Minister: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా

Updated Date - May 20 , 2025 | 03:20 PM