Home » Odisha
ఒడిశాలో సంచలనం రేపిన మహిళ పుర్రెలో సూదుల ఘటనలో బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం అయింది. బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లోని వైద్యులు యువతి పుర్రెలోంచి మొత్తం 77 సూదులను తొలగించారు.
నారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు.. 19 ఏళ్ల యువతి ప్రాణాలతో చెలగాటమాడాడు. వైద్యం పేరిట ఆ యువతి తలలో ఏకంగా 70 సూదులు గుచ్చేశాడు.
కాంగ్రెస్ పార్టీ 'రాజకీయ పరాన్నజీవి'గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇతర పార్టీల బలంపై ఆధారపడటం, ఇతర పార్టీల సహకారంతో, 'కూటమి' ఓట్లతో ఉనికి కాపాడుకుంటోందని విమర్శించారు. ఒడిశాలోని పూరీలో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివివ్ కమిటీ సమావేశంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్‌ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్‌ని తెరిచారు. ఇందులోని(Ratna Bhandar) ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు.
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది.
పూరీ క్షేత్రంలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఖజానా రత్నభాండాగారం 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. గది లోపల ఉన్న విలువైన వస్తువుల లెక్కింపుతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి ఖజానాను తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.
పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రం పూరీ క్షేత్ర రత్నభాండాగారం మరి కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది.
ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి.