Home » Nitish Kumar
వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా తన నివాసం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఖేమ్కా మృతి చెందారు. ఖేమ్కాకు మగధ్ ఆసుపత్రి, పలు పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి.
సీతమ్మ వారి జన్మస్థలమైన పునౌరా థామ్ సీతామఢి సర్వోతోముఖాభివృద్ధికి రూ.882.87 కోట్లతో సమగ్ర ప్లాన్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని నితీష్ కుమార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
బిహార్‌లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతున్నట్టు శనివారం ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రకటించారు.
బీహార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక ప్రకటన చేసింది. సామాజిక భద్రతా పెన్షన్ స్కీం కింద వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇప్పుడు ప్రతి నెలా రూ. 400కు బదులుగా రూ. 1100 పెన్షన్ లభిస్తుందని సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు.
బిహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అనేక విషయాలపై ప్రసంగించారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది క్రితం ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఖర్గే నిలదీశారు. 2015 ఆగస్టు 15న బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారని, ఆ సంగతేమిటని నితీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రజలు నిలదీయలని పేర్కొన్నారు.
నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.
Bihar Assembly Elections: రాజకీయాలకు క్రీడలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది స్పోర్ట్ స్టార్ట్స్ పాలిటిక్స్‌లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయల కోసం క్రీడల్ని వాడుకోవడం, పొత్తులపై స్పష్టత ఇచ్చేందుకు పాలిటిక్స్‌ను యూజ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది బిహార్‌లో చోటుచేసుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
చౌబే తరహాలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నితీష్ కుమర్ ఉపరాష్ట్రపతి కావాలనేది తన కోరక అని సుశీల్ కుమార్ మోదీ వంటి పలువురు బీజేపీ నేతలు చెప్పారు. రాజ్యాంగ ఉన్నత పదవికి తన పేరు పరిశీలించ లేదని నితీష్ 2022లో ఎన్డీయేను విడిచిపెట్టారు.