Home » Nitish Kumar
బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్‌బంధన్‌ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకొని మాజీ మిత్రపక్షమైన ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు.
బీహార్‌కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ తన మంత్రివర్గానికి శనివారంనాడు శాఖలు కేటాయించారు. హోం శాఖను సీఎం తన వద్దనే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్యం, క్రీడా శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయ శాఖ కేటాయించారు.
జీవితాంతం ఎన్డీఏ(NDA)లోనే కొనసాగుతానని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. బీజేపీ(BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఇండియా' బ్లాక్ నుంచి అనూహ్యంగా తప్పుకుని బీజేపీతో చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కు అసలు విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టడమే ఇష్టం లేదట. ఇదే విషయాన్ని ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విపక్ష కూటమికి 'ఇండియన్ నేషనల్ డవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్' పేరు వద్దని తాను కాంగ్రెస్‌కు, ఇతర విపక్ష కూటమి నేతలకు చెప్పానని తెలిపారు.
‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ కూటిమికి షాకిస్తూ వైదొలగిన విషయం తెలిసిందే. ఎన్డీయే సారథ్యంలో బిహార్‌లో ఆయన సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఇండియా కూటమి నేతలు నితీశ్‌పై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు అందిస్తున్న నేపథ్యంలోనే ఆయన భయంతో కూటమి నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు.
ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ ప్రజలకు విద్యుత్ పాలసీలో భాగంగా ఫ్రీగా విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.