Home » New Delhi
ఇరాన్ నగరాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,000 మంది భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ సింధు' కింద ప్రత్యేక విమానాల్లో న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. రాబోయే రెండ్రోజుల్లో వీరంతా ఢిల్లీకి చేరుకుంటారు.
ఎయిర్ ఇండియా విమానం వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉందని, అయితే పక్షి ఢీకొట్టడంతో రిటర్న్ ఫ్లైట్ను రద్దు చేశామని ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.
తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్కు తీసుకువస్తున్నారు.
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇరాన్లో 4,000 మంది భారతీయులుండగా, వారికి సగం మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలోనూ ఎక్కువ మంది జమ్మూకశ్మీర్కు చెందిన వారున్నారు. వీరు ప్రధానంగా మెడికల్, ఇతర వృత్తివిద్యా కోర్టులు చేస్తున్నారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఏఐ ప్రతినిధి చెప్పారు.
Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు.
టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు.
కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.