Home » Nellore
Kakani Govardhan Reddy : అసెంబ్లీ ఎన్నికల అనంతరం జగన్ పార్టీని పలువురు నేతలు ఒక్కొక్కరుగా వీడుతోన్నారు. మరికొందరు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో.. పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో కాకాణికి మరో గట్టి దెబ్బ తగిలింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సురేశ్, అతని అత్త సరస్వతి అక్కడికక్కడే మరణించారు.
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
కావలి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అపూర్వ సహోదరులు కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేశారు. గ్రావెల్ తవ్వకాలతో పాటు శ్మశానాలు, దేవదాయ భూములు కూడా వదిలిపెట్టలేదు
Dowry Harassment: నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను చూస్తే ఆడపిల్లలు పెళ్లి అంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందేమో. ఆ మహిళపట్ల అత్తింటి వారు ప్రవర్తించిన తీరు చూస్తే కన్నీరుపెట్టకుండా ఉండలేరు.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్‌ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడిప్‌లో నెల్లూరు సంతపేటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జొన్నాదుల కోటేశ్వరరావు కారు గెలుచుకున్నారు. కారు గెలుచుకోవడంతో పట్టరాని ఆనందంలో కోటేశ్వరరావు మునిగిపోయారు.
Illegal Mining Case: నెల్లూరు క్వార్ట్జ్ అక్రమాల కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రభాకర్ రెడ్డి.. న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
అక్రమ మైనింగ్ కేసులో వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాముడు జాతి, వర్ణ వివక్షలేని సమాజానికి ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలను సందర్శించి, సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు