Share News

Child Abuse Case Nellore: రా బంధువు

ABN , Publish Date - May 19 , 2025 | 04:46 AM

నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్‌ చేయించాడు.

Child Abuse Case Nellore: రా బంధువు

  • ఆమంచర్లలో ఏడాదిగా బాలికపై అత్యాచారం

  • గర్భం దాల్చడంతో అబార్షన్‌.. కేసు నమోదు

నెల్లూరు రూరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): సమీప బంధువైన ఓ బాలికపై ఓ మృగాడు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్‌ చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెల్లూరు రూరల్‌ సీఐ గుంజి వేణు వివరాల మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం ఆమంచర్లలో ఉంటున్న లగుచోటి ఏడుకొండలుకు భార్య, పిల్లలు ఉన్నారు. అతనికి సమీప బంధువులైన దంపతులు వారి కుమార్తె(14)ను ఏడుకొండలు ఇంట్లో వదిలి రోజు కూలి పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో ఏడుకొండలు బాలికను లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులుగా బాలిక నీరసంగా ఉంటుండటంతో ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా 5వ నెల గర్భవతి అని తేలింది. దీంతో ఏడుకొండలు బాలికకు అదే ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించాడు. ఈ మేరకు బాధితురాలి తల్లి శనివారం తమకు ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏడుకొండలు పరారీలో ఉన్నట్టు చెప్పారు.

Updated Date - May 19 , 2025 | 04:47 AM