Home » National
ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో రేపు(మంగళవారం) ఎన్నికలు జరిగే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో డూప్లికేట్ పేర్లు, తప్పుడు పేర్లు, అనర్హత కలిగిన ఓటర్లు రిజిస్టరైనట్టు పలు ఉదంతాలు ఉన్నాయని అన్నాడీఎంకే పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేసి మాట్లాడారు.
రోడ్డుపై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడివుండటం తాను చూశానని, అసలు ఏం జరిగిందో అప్పుడు తమకు అర్థం కాలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుడు ధాటికి పలు కార్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వినియోగదారుల సౌలభ్యం కోసం మరో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది ఉడాయ్. దీని ద్వారా ఆధార్‌ను భద్రపరచుకోవడంతో పాటు అవసరమైన వివరాలను మాత్రమే షేర్ చేస్కునే వెసులుబాటు ఉంటుంది.
దేశంలో మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణలో తీగ లాగగా సంబంధమున్న వ్యక్తుల డొంక కదులుతోంది.
ఇటీవల 150 వసంతాలు పూర్తి చేసుకున్న వందేమాతరం గేయాన్ని ఇకపై విధిగా ప్రతి స్కూల్లో పాడాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే దేశం పట్ల భక్తి, గౌరవం పెంపొందుతాయని యోగి సర్కార్ తెలిపింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా తల్హేరి గ్రామానికి చెందిన యద్వీందర్ అనే రైతు పుట్టగొడుగుల సాగుతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఆయన ఎనిమిదో తరగతి వరకే చదివి.. ఆర్థిక ఇబ్బందులతో బడి మానేశాడు. స్థానికంగా ఏ పనిలేక పోవడంతో ఆయన కుటుంబంలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కష్టాల కడలిని ఈది.. అతిమంగా విజయం సాధించారు.