Share News

Hyderabad Police Security: ఢిల్లీ పేలుడు ఘటన.. జూబ్లీహిల్స్‌లో విస్తృత తనిఖీలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 09:39 PM

ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో రేపు(మంగళవారం) ఎన్నికలు జరిగే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

Hyderabad Police Security: ఢిల్లీ పేలుడు ఘటన.. జూబ్లీహిల్స్‌లో విస్తృత తనిఖీలు
Jubilee Hills

దేశ రాజధాని ఢిల్లీ(Delhi Blast) సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో రేపు(మంగళవారం) ఎన్నికలు జరిగే హైదరాబాద్(Hyderabad High Alert) నగరంలోని జూబ్లీహిల్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు కార్లును, అనుమానిత వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.


ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌ పోలీసులు(Hyderabad High Alert) అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్‌ పాత నగరం నాకాబందీతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా హైద‌రాబాద్ సిటీ కమిషనర్ వీసీ స‌జ్జనార్ నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. రేపు(మంగళవారం) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills Byelection) జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోట దగ్గర భారీ పేలుడు..

ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..

Updated Date - Nov 10 , 2025 | 09:39 PM