Home » Narendra Modi
ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, యువత ఉద్యోగాలు, రైతుల నుంచి ఎంఎస్‌పీని మోదీ దోచుకుంటున్నారని విమర్శించారు.
Congress Slams PM Modi: ప్రధాని మోదీ ఇండియా సెమీ కండక్టర్ చరిత్ర గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అంటూ మండిపడ్డారు.
న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని, అమిత్ షా, రాజ్‌నాథ్..
జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు తీసుకురానున్నట్టు ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇవి దీపావళి బహుమతులని పేర్కొన్నారు. మరి ఈ సంస్కరణలు ఏమిటో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలుగనుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ 79వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసుకోవడానికి, వికసిత్ భారత్‌ను నిర్మించడం కోసం మనల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించుగాక.
79th Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
New Flats For MPs: ఎంపీల కోసం కొత్తగా నిర్మించిన 184 ఇళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గంలో ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో పాటు, ప్రయాణీకులకు సౌలభ్యం, వేగం, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయి.
రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల ధైర్యాన్ని స్మరించుకుని నివాళులు అర్పించారు.
భారత్-అమెరికా మధ్య నెలకొన్న సుంకాల వివాదం నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో అమెరికాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, చర్యలపై లోతుగా చర్చించనున్నారు.