Share News

Congress Slams PM Modi: ప్రధాని మోదీ అబద్ధాల కోరు.. జైరామ్ రమేశ్ ఫైర్

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:49 PM

Congress Slams PM Modi: ప్రధాని మోదీ ఇండియా సెమీ కండక్టర్ చరిత్ర గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అంటూ మండిపడ్డారు.

Congress Slams PM Modi: ప్రధాని మోదీ  అబద్ధాల కోరు.. జైరామ్ రమేశ్ ఫైర్
Congress Slams PM Modi

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇచ్చిన ప్రసంగంలో.. ఇండియా సెమీ కండక్టర్ చరిత్ర గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జైరామ్ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో నిన్న(శుక్రవారం) ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..


‘ప్రధాని మోదీ అబద్ధాల కోరు అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ చండీగఢ్‌లో ఏర్పాటైంది. 1983లో ఆపరేషన్స్ మొదలయ్యాయి’ అని అన్నారు. ఆ పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జోడించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ సెమీ కండక్టర్ల గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘నేను టెక్నాలజీకి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడినపుడు.. సెమీ కండక్టర్ల గురించిన ఉదాహరణను మీ దృష్టికి తీసుకువస్తాను.


నేను ఎర్ర కోట దగ్గర ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేను. విమర్శించాలని అనుకోవటం కూడా లేదు. కానీ, దేశంలోని యువత దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 50 నుంచి 60 ఏళ్ల క్రితం సెమీ కండక్టర్లకు సంబంధించిన ఫైల్ వర్క్ మొదలైంది. సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఆలోచన 60 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సెమీ కండక్టర్ల ఆలోచన అప్పుడే చచ్చిపోయింది. 50-60 ఏళ్లు మనం నష్టపోయాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

నేరాన్ని అంగీకరించిన డాక్టర్ నమ్రత.. ఏబీఎన్ చేతిలో కీలక రిపోర్ట్..

రెండు రోజుల్లో రెండోసారి.. ఎక్కడికెళ్లినా అదే మాట..

Updated Date - Aug 16 , 2025 | 01:56 PM