Share News

India Pakistan Nuclear War: రెండు రోజుల్లో రెండోసారి.. ఎక్కడికెళ్లినా అదే మాట..

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:50 PM

India Pakistan Nuclear War: తాము యుద్ధం ఆపడానికి ట్రంప్ కారణం కాదని భారత్ మొత్తుకుని చెబుతున్నా.. ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోవటం లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఇండియా, పాక్ యుద్ధం గురించి ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. తన వల్లే ఆరు యుద్ధాలు ఆగాయని అంటున్నారు.

India Pakistan Nuclear War: రెండు రోజుల్లో రెండోసారి.. ఎక్కడికెళ్లినా అదే మాట..
India Pakistan Nuclear War

ఇంగ్లీష్‌లో ‘డోంట్ బ్లో యువర్ ఓన్ ట్రంపెట్’ అని ఓ సామెత ఉంది. అంటే దానర్థం ‘సొంత డప్పాలు కొట్టడం మానుకోవాలి’ అని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ సామెత గురించి తెలియనట్లుంది. ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నారు. తానే లేకపోతే రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగి నాశనం అయ్యేవి అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి ఒకరోజు ముందు ఆయన ఇండియా, పాక్ యుద్ధం గురించి మాట్లాడారు.


‘ఆ సమయంలో భారత్‌-పాక్‌ విమానాలు గాల్లో లేచాయి. 6-7 విమానాలు కుప్ప కూలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అణ్వాయుధాలు ప్రయోగించుకునేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే మేము కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాం’అని అన్నారు. నిన్న పుతిన్‌తో భేటీ తర్వాత కూడా ఇండియా, పాక్ యుద్ధం గురించి మాట్లాడారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియా, పాకిస్తాన్ యుద్ధమే తీసుకోండి.


రెండు దేశాలు విమానాల్ని కూల్చేసుకుంటున్నాయి. అది అణు యుద్ధంగా మారేది. నేనైతే కచ్చితంగా చెప్పగలను.. మేము గనుక అడ్డుపడకపోయి ఉంటే అది అణు యుద్ధంగా మారేది. మేమే ఆ యుద్ధాన్ని ఆపాము’ అని అన్నారు. కాగా, తాము యుద్ధం ఆపడానికి ట్రంప్ కారణం కాదని భారత్ మొత్తుకుని చెబుతున్నా.. ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోవటం లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఇండియా, పాక్ యుద్ధం గురించి ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. తన వల్లే ఆరు యుద్ధాలు ఆగాయని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

జుట్టుతో తయారైన టూత్ పేస్ట్.. ఇన్ని లాభాలు ఉన్నాయా?..

చైనా అద్భుత సృష్టి.. ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి..

Updated Date - Aug 16 , 2025 | 12:56 PM