Home » Nandyal
పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ప్రజలకు సూ చించారు. ఈ నెల 7న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణం లోని పోలీసుస్టేషన్ ఆవరణలో ఆదివారం ఆయా మతల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.
నంద్యాల జిల్లాలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం నాలు పట్టణాల్లో డీఎస్సీ మోడల్ పరీక్ష నిర్వహించారు.
పట్టణంలో ఏర్పాటు చేసిన పలు రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడంతో పాటు 65ఏళ్ల వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేశారు.
Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
పట్టణంలోని టెక్కెలో ఉన్న వ్యవసాయ కమిటీ మార్కెట్‌యార్డు గోడౌన్లను ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి బుధవారం తనిఖీ చేశారు.
‘యోగాంధ్ర’లో భాగంగా పట్టణంలోని అమ్మవారిశాల కల్యాణ మండపంలో ఆసనాలు వేశారు.
తెలుగుజాతి గర్వించే మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారని డీఎస్పీ రామాంజి నాయక్, మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్ అన్నారు.
రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
దేశ ప్రధాని మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై ధరల భారం పడుతోందని సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధు ఆరోపించారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఆలయ సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.