మార్కెట్ యార్డు గోడౌన్ల తనిఖీ
ABN , Publish Date - May 29 , 2025 | 12:22 AM
పట్టణంలోని టెక్కెలో ఉన్న వ్యవసాయ కమిటీ మార్కెట్‌యార్డు గోడౌన్లను ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి బుధవారం తనిఖీ చేశారు.
నంద్యాల నూనెపల్లె, మే 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టెక్కెలో ఉన్న వ్యవసాయ కమిటీ మార్కెట్‌యార్డు గోడౌన్లను ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి బుధవారం తనిఖీ చేశారు. గోదాములోని రికార్డులను ఆమె పరిశీలించారు. పౌరసరఫరాలకు సంబంధించిన రేషన్ వివరాలను అడిగితెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా గోదాములోని స్టాక్ పాయింట్లను పరిశీలించినట్లు తెలిపారు.