Share News

రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 12:15 AM

రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు.

రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

మహానంది, మే 29 (ఆంధ్రజ్యోతి): రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. మండలంలోని బుక్కాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో గురువారం భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా యాగంటి పల్లె కృషి విజ్ఞానకేంద్రం ద్వారా వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వవహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. రైతులు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేసుకోవాలన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని సూచించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త డాక్టర్‌ సూగన్న, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ధనలక్ష్మి, రమణయ్య పాల్గొని ఖరీఫ్‌ ముందు చేపట్టాలిసిన సన్నద్ధత కార్యక్రమాలపై వివరించారు. ఇందులో భాగంగా భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం ప్రస్తుతం పంటల్లో వేయాలిసిన ఎరువుల మోతాదును వివరించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న ప్రభుత్వ పధకాలపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు, ఆత్మ పీడీ రత్నకుమార్‌, ఏడీఏ రాజశేఖర్‌, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో మహమ్మద్‌దౌలా, సర్పంచ్‌ వరలక్ష్మమ్మ, జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:15 AM