పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:15 AM
పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ప్రజలకు సూ చించారు. ఈ నెల 7న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణం లోని పోలీసుస్టేషన్ ఆవరణలో ఆదివారం ఆయా మతల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.
ఆత్మకూరు, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ప్రజలకు సూ చించారు. ఈ నెల 7న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణం లోని పోలీసుస్టేషన్ ఆవరణలో ఆదివారం ఆయా మతల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పండుగలను అన్ని వర్గాల ప్రజలు మతసామరస్త్యంతో సంబరంగా చేసుకోవాలే తప్ప వివాదాలకు దారితీసే విధంగా ఉండకూడదని సూచించారు. ఏదైనా సున్నితమైన విషయాలు చోటుచేసుకున్నప్పుడు పెద్దలు వాటిని సవరించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఆత్మకూరు ప్రాంతం ప్రశాంతతకు నిలయమని, ఇక్కడ హిందూ, ముస్లిం సోదరభావంతోకలిసి ఉండటం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని పండుగలను ఐక్యమత్యంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. ఆత్మకూరు అర్బన్ సీఐ రాము, ఎస్‌ఐ నారాయణరెడ్డి ఉన్నారు.