Home » Mulugu
ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య మరణం ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
మంత్రి ధనసరి అనసూయ సీతక్క డీజే టిల్లు సినిమా పాటలు, తీన్‌మార్ మ్యూజిక్‌కు స్టెప్పులేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రీకే రన్ జరిగింది.
Medaram: ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతర కోసం మేడారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 40 లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం.. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 12న ఆలయ శుద్ది, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు.
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏడాదికోసారైనా అలా ఓ హాలిడే ట్రిప్ వేసి ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికి ఏ విదేశానికో.. బయట రాష్ట్రానికో వెళ్లనవసరం లేకుండా మన తెలంగాణలోనే గొప్ప పర్యాటక అనుభూతి పొందేందుకు గొప్ప అవకాశం!
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ ఏడాది ఆగస్టు 31న సుమారు 15 కిలో మీటర్ల వ్యవధిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది.
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏటూరునాగారం అభయారణ్యాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా(ఎకో సెన్సిటివ్ జోన్‌గా) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: చెల్పాక ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీంచారు. చెల్పాక ఎన్‌కౌంటర్ అంతా బూటకమే అని, అన్నంలో విషం పెట్టి చంపారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు.
పౌరహక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు భగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్దపులులు, చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు.