Home » MLA
హెల్మెట్ ధరించని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసులు జరిమానా విధించారు. తమిళనాడు రాష్ట్రం విలవంగోడు మహిళా ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్ హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపారంటూ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు.
‘గత ఐదేళ్ల వైసీపీ హయాంలో టీ డీపీ కార్యక ర్తల కష్టాన్ని కళ్లారా చూశాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన కార్యక ర్తలకు తప్పక న్యాయం చేస్తాం. కార్యకర్త ల రుణం తీర్చు కోలేనిది.’ అని శింగనమల నియోజకవర్గం మినీ మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలకేంద్రమైన గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్ వద్ద టీ కన్వెన్షన హాల్లో మినీ మహానాడు ను బుధవారం నిర్వహించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్లపై ఏర్పడిన గుంతలకు తట్టెడు మట్టి వేయించుకోలేని అసమర్థుడు తోపుదుర్తి ప్రకాశరెడ్డి అని ఎమ్మెల్యే పరిటాల సునీత ఎద్దేవ చేశారు. కనగానపల్లి మండలపరిధిలోని బాలెపాళ్యం- నెమలి వరం గ్రామాల మధ్య ఎనఆర్ఈజీఎస్ కింద రూ. 2కోట్లు నిధులతో నూతనంగా నిర్మించిన తారురోడ్డును సోమవారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు.
శింగనమల నియో జకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పి లుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఆర్అండ్బీ అతిఽథి గృహంలో సోమవారం ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జ్లతో మినీ మహానాడుపై సమా వేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పిలుపునిచ్చారు. అర్బన నియోజకవర్గం మినీ మహానాడును మంగళవారం ఉదయం 10 గంటలకు నగరంలోని కమ్మభవనలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవా రం పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కమ్మభవనలో మినీమహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.
Congress MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మెగారెడ్డి ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని సీఎం చంద్రబాబు హైదరాబాద్లో పరామర్శించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్లో ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కుడి భుజానికి తీవ్ర గాయం కలిగింది. హైదరాబాద్లో కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.
Tangirala Soumya: పదోతరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు విమాన ప్రయాణాన్ని ప్రభుత్వ విప్, నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కల్పించనున్నారు. ఎమ్మెల్యే నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాప్తాడు నియోజకవ ర్గానికి త్వరలోనే మార్కెట్ యార్డును తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె సోమవారం నగరంలోని క్యాంపు కార్యాలయం లో రాప్తాడు మార్కెట్ యార్డు కమిటీ నూతన సభ్యులతో సమావేశం నిర్వహించారు. యార్డు చైర్మన సుధాకర్, వైస్ చైర్మన కృష్ణయ్యతో పాటు 15మంది డైరెక్టర్లు హాజరయ్యారు. వారు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.