Share News

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

ABN , Publish Date - Jun 24 , 2025 | 01:52 PM

గృహనిర్మాణ శాఖలో ఇళ్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సీనియర్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. అయితే ఆ సంఘటన మరువకముందే బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

- ఎమ్మెల్యే రాజు కాగె

బెంగళూరు: గృహనిర్మాణ శాఖలో ఇళ్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సీనియర్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. అయితే ఆ సంఘటన మరువకముందే బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె(Kagawada MLA Rajakage) ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.


బెళగావిలో మీడియాతో మాట్లాడిన ఆయన మా ప్రభుత్వంలో ఏ అధికారి సక్రమంగా పనిచేయడం లేదని, పాలనా వ్యవస్థ సంపూర్ణంగా దారి తప్పిందని ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చెప్పింది అబద్ధం కాదని, అంతా వాస్తవమేనన్నారు. బీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యలకు మించిన రీతిలో తన పరిస్థితి ఉందన్నారు. మా నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు గ్రాంట్లు మంజూరు చేశారని, వర్క్‌ ఆర్డర్‌ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టి ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.


pandu2.2.jpg

తన మనసు తీవ్రంగా బాధ కలుగుతోందన్నారు. నేను సైతం రాజీనామా ఇచ్చే పరిస్థితిలో ఉన్నానని, రెండు రోజుల్లో రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదన్నారు. రాజుకాగె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా... లేదా కార్పొరేషన్‌ పదవికి రాజీనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాజుకాగె అసంతృప్తిపై బెళగావిలో రాజ్యసభ సభ్యుడు ఈరణ్ణకడాడి స్పందిస్తూ రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు.


మీ ముఖ్యమంత్రి చేత రాజీనామా ఇప్పించి ప్రజలవద్దకు వెళితే సరైన నిర్ణయం సాధ్యమన్నారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తానన్నారు. రాజుకాగె 2019లో బీజేపీని వీడి కాంగ్రెస్‏లో చేరి కాగవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారు. కాగా రాయచూరులో సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ రాజుకాగెను పిలిపించి మాట్లాడతానని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 01:53 PM