Share News

సుపరిపాలనకు ఏడాది పూర్తి

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:21 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో ఏడాది పూర్తి చేసుకుని అభివృద్ధి, సంక్షేమం వైపు ఉరకలు వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు.

సుపరిపాలనకు ఏడాది పూర్తి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిద్దాం

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూన 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో ఏడాది పూర్తి చేసుకుని అభివృద్ధి, సంక్షేమం వైపు ఉరకలు వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల రోడ్డులోని ఎమ్మార్‌ ఫంక్షనహాల్లో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, నంద్యాల తెలుగు మహిళా అఽధ్య క్షురాలు కె.పార్వతమ్మతో కలిసి సుపరిపాలనలో తొలిఅడుగు సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమంతోపాటు రాబోవు నాలుగేళ్లలో రాష్ర్టాభివృద్ధి కోసం అమలు చేయాల్సిన ప్రణాళికలు, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్ర మంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నార్ల మోహనరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మంచాలకట్ట శ్రీనివాస రెడ్డి, గోవిందరెడ్డి, ఎన్వీ.రామకృష్ణ, ఈవీ.రమణ, శైలజాయాదవ్‌, ఎస్‌ ఫి రోజ్‌, గంగాధర్‌గౌడ్‌, రాంబాబు, మధునాయక్‌, కేతూర్‌మధు, వాకిటి మాదేష్‌, మహేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:21 AM