Home » Minister Nara Lokesh
సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర యాదవ్ సూచించారు.
ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు.
ఎస్కేయూలో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై విచారణ కమిటీ వేశామని... నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. ఎస్కేయూలో నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయారని.. కానీ దాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సొంత భవనాల్లో లేవని.. వీటిలో రెండు భవనాలను కట్టడం ప్రారంభించినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు.
ఎమ్మెల్యేగా గెలిచాక తనకు ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. విద్యాశాఖ కావాలని చెప్పినట్లు లోకేశ్ పేర్కొన్నారు. యూనియన్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని అన్నారని.. అయినా అదే శాఖ కావాలని కోరినట్లు చెప్పారు.
ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఉత్సాహంగా ఉండగా వారిని మరింత సంతోషపరుస్తూ నియామకపత్రాల పంపిణీకి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గురువారం రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయ సమీపంలో డీఎస్సీ సభకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న యూనివర్సిటీ ద్రవిడియన్ యూనివర్సిటీ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. భాషా సంబంధమైనది కాబట్టి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
విద్యార్థుల్లో నైతిక విలువలను అలవర్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దానికోసమే చాగంటి కోటేశ్వరరావును రాష్ట ప్రభుత్వం సలహాదారుగా నియమించిందని గుర్తు చేశారు.
అమ్మఒడి రాలేదు తల్లికి వందనం వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు
పులివెందులలో జగన్ కనీసం కాలేజీ కట్టలేదని మంత్రి లోకేష్ అన్నారు. దీనిపై అసెంబ్లీ, శాసన మండలిలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తామని చెప్పారు. అమ్మ అన్నం పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్టు జగన్ వైఖరి ఉందంటూ ఎద్దేవా చేశారు.