Lokesh Met TDP Ministers: వారికి అవగాహన కల్పించండి.. మంత్రులతో లోకేష్
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:24 PM
కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని తెలుగు దేశం మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు. అలాగే విశాఖ సీఐఐ సదస్సుపై కూడా మంత్రులతో జరిగిన సమావేశంలో లోకేష్ చర్చించారు.
అమరావతి, నవంబర్ 10: తెలుగుదేశం మంత్రులతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అన్నారు. సీనియర్లు ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరమన్నారు. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాలు నేర్చుకోవాలని కీలక సూచనలు చేశారు.
ఈ నెల 14, 15తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసి కట్టుగా విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ప్రతీ మంత్రి తమ తమ శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామని అన్నారు. రేపు ఎంఎస్ఎమ్ఈ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. తమ తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామని మంత్రులతో నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కార్తీక మాసం మూడో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
Read Latest AP News And Telugu News