Home » Medical News
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కారానికే అధికారులతో కమిటీ వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
పిల్లల కోసం ఆరేళ్ల నిరీక్షణ.. ఎన్నెన్నో ఆశలు.. చివరికి ఆమె గర్భవతైంది. కానీ, ఐదు మాసాలకే ఆశలు అడియాసలయ్యాయి. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నెలలు నిండని ఓ గర్భిణికి నర్సు చేసిన వైద్యం వికటించి కవల పిల్లలు మృతి చెందారు.
స్టాఫ్‌నర్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో తమ మార్కులు తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.
క్లిష్టమైన క్రిమినల్ కేసుల్లో.. ఫోరెన్సిక్ విశ్లేషణ అత్యంత కీలకం.. నేరస్థులకు కోర్టుల్లో శిక్ష పడాలంటే.. పోలీసుల దర్యాప్తుతోపాటు.. ఫోరెన్సిక్ నివేదికల ప్రాముఖ్యత అంతాఇంతా కాదు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. అప్పటి నుంచి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల బాలుడు శ్రీతేజను మంగళవారం రాత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు.
CM Relief Fund: సీఎం సహాయ నిధిలో కొన్ని ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడు తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆ ఆస్పత్రులపై సీరియస్ అయింది. వైద్యశాఖ దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వైద్య విద్య కళాశాలల్లో నకిలీ బోధన సిబ్బందికి చెక్ పెట్టే దిశగా జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ముఖ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
చిన్నప్పటి నుంచి అరుదైన కాలేయ వ్యాధితోపాటు ఊపిరితిత్తులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న యువకుడికి ఉస్మానియా వైద్యులు 18 గంటలపాటు శ్రమించి పునర్జన్మ ప్రసాదించారు.
రాష్ట్రంలో మరో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో కొత్త కాలేజీని ప్రభుత్వం అనుమతించింది