Share News

TIMS Hospitals: టిమ్స్‌ ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీల్లో మార్పు

ABN , Publish Date - May 20 , 2025 | 04:03 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్‌బీ నగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీలు మారాయి.

TIMS Hospitals: టిమ్స్‌ ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీల్లో మార్పు

  • జూన్‌ 26న ఎల్‌బీనగర్‌, ఆగస్టు 31న సనత్‌నగర్‌..

  • డిసెంబరులో అల్వాల్‌ టిమ్స్‌, వరంగల్‌ ఆస్పత్రి ప్రారంభం

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్‌బీ నగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీలు మారాయి. వాస్తవానికి ఈ టిమ్స్‌ను ఈ ఏడాది జూన్‌ 2 నుంచి ప్రారంభించాలని ఆర్‌ అండ్‌ బీ, వైద్యారోగ్య శాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు మంత్రులు కూడా పలు వేదికల్లో ప్రారంభోత్సవ తేదీలను ప్రక టించారు. నిర్మాణపరంగా 85-90 శాతం పనులు పూర్తయినప్పటికీ ఇతర దేశాల నుంచి రావాల్సిన అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలు రావడంలో జాప్యం జరుగుతోందని, దీంతో ఆస్పత్రుల ప్రారంభోత్సవాల్లోనూ ఆలస్యం జరుగుతోందని సమాచారం.


ఈ నేపథ్యంలో జూన్‌ 26న ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌, ఆగస్టు 31న సనత్‌నగర్‌, డిసెంబరులో అల్వాల్‌ టిమ్స్‌ను ప్రారంభించేందుకు అధికారులు ప్రాథమికంగా తేదీలను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. మరోవైపు వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా డిసెంబరులో ప్రారంభించాలని నిర్ణయించారు.

Updated Date - May 20 , 2025 | 04:03 AM