• Home » Mancherial

Mancherial

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్డులో చేపట్టిన మహా ప్రస్తాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల మార్కెట్‌ ఏరియాలో పర్యటించారు. మార్కెట్‌ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు మంద కొడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు మోహనాచారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వినూత్న నిరసన

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వినూత్న నిరసన

సమస్యలు పరిష్కరించాలని సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మి కులు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్‌ కుమార్‌లు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపుల విష యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి

క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి

కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

శాలివాహన భూములను అమ్మవద్దు

శాలివాహన భూములను అమ్మవద్దు

పాత మంచిర్యాలలో శాలివాహన పవర్‌ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్‌ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది.

దేశ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద

దేశ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు.

ఎస్టీపీపీకి సేఫ్టీ అవార్డు

ఎస్టీపీపీకి సేఫ్టీ అవార్డు

సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్‌-పవర్‌ థర్మల్‌ సెక్టర్‌ విభాగంలో 1వ గ్రీన్‌ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్‌ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు ఆదివారం పేర్కొన్నారు.

ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌లకు మోక్షమెప్పుడో...!

ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్‌లకు మోక్షమెప్పుడో...!

మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు.

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్‌ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్‌ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి