• Home » Mancherial

Mancherial

 నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి

నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి

మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి అగుపించడం లేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.164 కోట్లతో నిర్మించ తలపెట్టిన గోదావరిపై అంతర్గాం వంతెన ఊసే లేదని, నిర్మించిన ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌, ఐబీ గెస్ట్‌హౌజ్‌ను లేకుండా చేశాడన్నారు.

నాణ్యమైన భోజనం అందించేందుకే కామన్‌ మెనూ

నాణ్యమైన భోజనం అందించేందుకే కామన్‌ మెనూ

గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచి కామన్‌ మెనూను ప్రారంభించిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ప్రభు త్వం ప్రవేశపెట్టిన కామన్‌ డైట్‌ మెనూను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.

లోక్‌అదాలత్‌లో 5,500 కేసుల పరిష్కారం

లోక్‌అదాలత్‌లో 5,500 కేసుల పరిష్కారం

రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరిగిందని, ఏడు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో  సత్తాచాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. శనివారం నియోజకవర్గ సంస్ధాగత ఎన్నికల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.

జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

కుటుంబ సమస్యలు... ఆర్థిక ఇబ్బందులు... అనారోగ్య సమస్యలు... ప్రేమ విఫలమైందని...స్టాక్‌ మార్కెట్‌లో నష్టం వచ్చిందని.. ఇలా రకరకాల కారణాలతో మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు.. సమస్య ఏదైనా చావే పరిష్కారమని ఆలోచిస్తూ నెల రోజుల వ్యవధిలో 20 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ఆహార నాణ్యతలో విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి వంటశాల గదులు, కూరగాయల నిల్వ వంట సామగ్రిని పరిశీలించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం ముల్కల్ల, గుడిపేట గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీసీపీ భాస్కర్‌, అదనపు డీసీపీ రాజులతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలి

ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని, వాటి వివరాలను రెండు రోజుల్లో తెలియజేయాలని సూచించారు.

వామ్మో చలి...!

వామ్మో చలి...!

జిల్లాలో రెండు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతు న్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి