Home » Mancherial district
మండలంలోని సర్వాయిపేట గ్రామా నికి చెందిన గుగ్లోత్ రుచిత జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వ హించే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఎంపికైంది. కోటపల్లి మోడల్ స్కూల్, కళాశాలలో ఇంటర్ వరకు చదువుకున్న రుచిత ప్రస్తుతం శాతావాహన విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం... లాభాల లక్ష్య సాధనలో కృషి చేస్తోంది... ఉద్యోగావకాశాలు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పిస్తోంది... నూతన విద్యుత్ ప్రాజెక్టుల వైపు దూసుకెళ్తోంది... అయితే గతేడాది కంటే ఈసారి బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది.
భారత కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి శత వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీరాంపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
మంచిర్యాలోని ఐబీ చౌరస్తాలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆదివారం దత్తావతార కార్తీక్ మహారాజ్ చప్రాడ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రెబ్బెన, టోంకిని మీదుగా ఈ నెల31న సాయంత్రం మహారాష్ట్రలోని హనుమాన్ మందిర్ ప్రశాంత్‌ధాం వరకు సాగనుందని భక్తులు తెలిపారు.
ఓపెన్‌స్కూల్ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎన్.అశోక్ అన్నారు. దండేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులను ఆదివారం పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు రెగ్యులర్ పది, ఇంటర్‌తో సమానమన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చనన్నారు.
సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట శిబిరంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్క్ ధరించగా, మహిళా ఉద్యోగులు వారికి రాఖీలు కట్టారు.
జిల్లాలో క్రైం రేట్ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది.
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ డిమాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలువురు రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు.