• Home » Mancherial district

Mancherial district

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్‌ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్‌ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ప్రాణహిత, కుప్తి, మందాకిని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పేర్కొ న్నారు. శుక్రవారం మంచిర్యాలలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముం దు సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి మర్చిపోయారన్నారు.

ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సాపూర్‌ (బెజ్జాల) గ్రామంలో తాండూర్‌ సర్కిల్‌ పోలీసులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాజారమేష్‌ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్‌పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు.

ఆగని ఇసుక అక్రమ రవాణా...

ఆగని ఇసుక అక్రమ రవాణా...

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకు న్నారు.

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీటవేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి ఠాగూర్‌ స్టేడి యంలో అస్మిత ఖేలో ఇండియా అండర్‌ -13 ఉమెన్స్‌ పుట్‌బాల్‌ లీగ్‌ 2024-2025 టోర్నమెం ట్‌ను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పత్తి కొనుగోలుకు పడిగాపులు

పత్తి కొనుగోలుకు పడిగాపులు

సీసీఐ అధికారులు, జిన్నింగు మిల్లు యజ మానులు దళారులకు కొమ్ము కాస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లు యజమానులతో వాగ్వాదానికి దిగా రు. రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లు వద్ద రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మా భూములు మాకు ఇప్పించండి

మా భూములు మాకు ఇప్పించండి

మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లా డుతూ దొరలకు పాలేరుగా ఉండడంతో అందించిన భూమిని రెండేళ్ళ క్రితం వరకు సాగు చేసుకుని జీవిస్తుండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభి వృద్ధి పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుందన్నారు.

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు...

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు...

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి