Home » Mallikarjun Kharge
డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాకుండా ఎవరూ ఆపలేరంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీరప్ప మొయిలీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ఖర్గేను డీకే కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీని ఎవరూ బాగుచేయలేరా..? దేశవ్యాప్తంగా ఆ పార్టీకి భవిష్యత్తు లేదా..? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి. గ్రాండ్ ఏఐ పార్టీలో మార్పులు తీసుకు రాలేరా..? ఆ పార్టీ ఓడిపోతే ఎవరూ బాధ్యత తీసుకోరా..? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జీరో స్కోర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. వెంటనే నీరజ్ శేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడటంతో ఖర్గే ఒక్కసారిగా సహనం కోల్పోయారు.
నరేంద్ర మోదీ గత పదేళ్ల పాలనలో మధ్యతరగతి ప్రజానీకం నుంచి రూ.54.18 లక్షల కోట్లు ఆదాయం పన్ను రూపంలో వసూలు చేసిందని, ఇప్పుడు రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ప్రకటించి ఏడాదికి రూ.80,000 ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెబుతున్నారని ఖర్గే అన్నారు.
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్,. హిందూ మహాసభ రాజ్యాంగం ప్రతులను, నెహ్రూ విగ్రహాన్ని దగ్ధం చేసినట్టు ఖర్గే ఆరోపించారు. చరిత్రను అర్ధం చేసుకోకుండా మాట్లాడటం నయవంచనేనని అన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. మన దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందని భాగవత్ పేర్కొన్నారు.
మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.