Share News

Mallikarjun Kharge: పెద్దల సభలో సారీ చెప్పిన మల్లికార్జున్ ఖర్గే

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:50 PM

రాజ్యసభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే జోక్యం చేసుకుంటూ, తాను ఉదయం మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో లేరని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని అన్నారు.

Mallikarjun Kharge: పెద్దల సభలో సారీ చెప్పిన మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ (Rajya Sabha)లో మంగళవారంనాడు దుమారం రేపాయి. దీనిపై అధికార సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెనక్కి తగ్గిన ఖర్గే తన వ్యా్ఖ్యలకు క్షమాపణ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు చైర్మన్‌ను ఉద్దేశించి కాదని, ప్రభుత్వ విధానాలను ఉద్దేశించి చేసినవని వివరణ ఇచ్చారు.

Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు


రాజ్యసభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. చర్చను ప్రారంభించాలని దిగ్విజయ్ సింగ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచించారు. ఈ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ డీఎంకే ఎంపీలు పట్టుబడ్డారు. ఈ క్రమంలో ఖర్గే జోక్యం చేసుకుంటూ, తాను ఉదయం మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో లేరని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్బంగానే ఆయన ఒక హిందీ పదాన్ని ఆయన వాడారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్‌ను ఉద్దేశిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాదని రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా మండిపడ్డారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని, ఆయన అన్న మాటలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు.


ఖర్గే తిరిగి స్పందిస్తూ, తాను ఛైర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వ విధానాల గురించే అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. తన మాటలు బాధపెట్టి ఉంటే క్షమించాలని ఛైర్‌కు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో సోమవారంనాడు తమిళనాడుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆ ప్రభావం రాజ్యసభలోనూ కనపిచింది. విద్యార్థుల భవిష్యత్తును తమిళనాడు ప్రభుత్వం నాశనం చేస్తోందని, అనాగరికంగా, అనైతికంగా ప్రవర్తిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో విమర్శించారు. తమిళనాడు ప్రజలను అనాగరికులంటూ వ్యాఖ్యానించండంపై డీఎంకే ఎంపీ కనిమొళి తప్పుపట్టారు. కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని, తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంటూ ఆయనపై ప్రివిలిజ్ మోషన్ ప్రవేశపెట్టారు.


ఇవి కూడా చదవండి

Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2025 | 09:29 PM