Home » Maldives
టూరిజం అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) చేసిన వ్యాఖ్యలకు తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) కౌంటర్ ఇచ్చారు. వేధించేవాళ్లు ఎప్పుడూ $4.5 బిలియన్ల సహాయాన్ని అందించరని ఆయన పేర్కొన్నారు.
మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో (India) సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన.. మొదటి నుంచే భారత్‌పై వ్యతిరేక వైఖరి కనబరుస్తూ వస్తున్నారు. సైనికుల ఉపసంహరణ (Indian Troops) దగ్గర నుంచి కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవడం దాకా.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రెండు దేశాల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2024 జాబితాలో భారత్ 85వ ర్యాంకుకు పరిమితమైంది.
తన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మే 10వ తేదీ నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయని పేర్కొన్నారు. తమ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని కూడా అనుమతించబోమని వ్యాఖ్యానించారు.
మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశాడో తెలీదు కానీ, అప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొలుత టూరిజం అంశంలో ఇరు దేశాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఆ వివాదం బాగా ముదిరింది.
భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) వైఖరి ఓ బాలుడి ప్రాణాన్ని బలికొంది. అత్యవసర పరిస్థితిలో భారత్ అందించిన ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగించడానికి ముయిజ్జు నిరాకరించడంతో మాల్దీవులకు చెందిన14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో.. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలన్న ఆలోచనని విరమించుకుంటున్నారు. ఆ ప్రాంతానికి బదులు లక్షద్వీప్‌లో విహరించాలని నిర్ణయించుకుంటున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేసినందుకే.. ప్రతి ఒక్కరూ మాల్దీవులను బాయ్‌కాట్ చేస్తున్నారు.
భారతదేశం, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య.. భారత్ ముందు మాల్దీవులు ఒక డెడ్‌లైన్ పెట్టింది. మార్చి 15వ తేదీలోగా భారత దళాలను ఉపసంహరించుకోవాలని న్యూఢిల్లీని కోరింది. మాలేలోని..
ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదాస్పద వాతావరణం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.
ఓ వైపు భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరో వైపు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) చైనా పర్యటన నిప్పు రాజేస్తోంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) ముయిజ్జుని తమ పాత మిత్రుడిగా అభివర్ణించారు.