Share News

India vs Maldives: భారత్‌పై ముయిజ్జు చెప్పినవన్నీ అబద్ధాలే.. నగ్నసత్యాలు బయటపెట్టిన మాజీమంత్రి

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:32 PM

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో (India) సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన.. మొదటి నుంచే భారత్‌పై వ్యతిరేక వైఖరి కనబరుస్తూ వస్తున్నారు. సైనికుల ఉపసంహరణ (Indian Troops) దగ్గర నుంచి కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవడం దాకా.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రెండు దేశాల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

India vs Maldives: భారత్‌పై ముయిజ్జు చెప్పినవన్నీ అబద్ధాలే.. నగ్నసత్యాలు బయటపెట్టిన మాజీమంత్రి

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో (India) సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన.. మొదటి నుంచే భారత్‌పై వ్యతిరేక వైఖరి కనబరుస్తూ వస్తున్నారు. సైనికుల ఉపసంహరణ (Indian Troops) దగ్గర నుంచి కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవడం దాకా.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రెండు దేశాల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ముయిజ్జుపై వ్యతిరేకత ఎదురవుతోంది. సొంత దేశంలోని ప్రతిపక్ష నాయకులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు.

తాజాగా ముయిజ్జుపై మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ సైన్యంపై ఆయన చేసిన వాదనలన్నీ పచ్చి అబద్ధాలేనని తోసిపుచ్చారు. తమ దేశంలో సాయుధ విదేశీ సైనికులు లేరని.. వారి నిర్దిష్ట సంఖ్యను అందించలేకపోవడం ఈ పాలన అసమర్థతని తెలియజేస్తుందని తూర్పారపట్టారు. ‘‘ముయిజ్జు ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యింది. ద్వీపదేశంలో వేలాదిమంది భారతీయ సైనికులు ఉన్నారని ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. సాయుధ విదేశీ సైనికుల నిర్దిష్ట సంఖ్యను అందించలేకపోవడం.. ముయిజ్జు పాలన అసమర్థతని ఎత్తిచూపుతుంది. దేశంలో సాయుధ విదేశీ సైనికులు ఎవరూ లేరు. పారదర్శకత ఎంతో ముఖ్యం. సత్యం గెలవాలి’’ అని షాహిద్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.


తన 100 రోజుల పాలనలో ముయిజ్జు ఎన్నో అసత్యాలు చెప్పారని, అందులో భారత్ సైన్యంపై చేసిన అబద్ధపు ప్రచారం ఒకటని అబ్దుల్లా షాహిద్ తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (Maldivian Democratic Party) వల్లే వందలాది మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేశారని, అయితే అధికారంలోకి వచ్చాక అలాంటి ఒప్పందాలు కుదిరినట్టు ఆయన నిరూపించలేకపోయారని షాహిద్ అన్నారు. అందుకే.. ఈ విషయంలో తాము ప్రజల్లో ఎక్కడ విశ్వాసం కోల్పోతామన్న భయంతో ముయిజ్జు పదేపదే అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. ముయిజ్జు చెప్తున్నట్టు తమ ద్వీపదేశంలో సాయుధ విదేశీ సైనికులు లేరని షాహిద్ మరోసారి స్పష్టం చేశారు.

ఇదిలావుండగా.. మార్చి 10వ తేదీ లోపు మొదటి భారత సైనిక సిబ్బందిని మాల్దీవుల నుంచి తిరిగి పంపుతామని ముయిజ్జు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే.. మిగిలిన రెండు స్థావరాల్లోని భారతీయ దళాలు మే 10వ తేదీ నాటికి వెనక్కు వెళ్లిపోతాయని ఆయన తెలిపారు. దాదాపు 90 మంది భారతీయ సైనిక సిబ్బంది మాల్దీవుల్లో న్యూఢిల్లీ ప్రాయోజిత రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నాయి. భారత యుద్ధనౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో పెట్రోలింగ్‌లోనూ సహాయపడతాయి.

Updated Date - Feb 26 , 2024 | 03:32 PM