Home » Mahesh Kumar Goud
Minister Ponnam Prabhakar: భారత్ సమ్మిట్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెట్టుబడులకు, ఇండస్ట్రియల్ రంగానికి హైదరాబాద్ ఎలా ఉపయోగపడుతుందో భారత్ సదస్సు డిక్లరేషన్‌లో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Mahesh Kumar Goud: టీపీసీసీ ప్రక్షాళనపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో జరుగుతున్న జై బాపు, జై భీమ్ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.
Rythu Mahotsava Sabha: నిజామాబాద్‌లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
బీఆర్ఎస్ నేతలు అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి చర్యలను కేటీఆర్ అజ్ఞానంగా విమర్శించడంపై మండిపడ్డారు.
పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. తెలంగాణకు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కనీసం అంబర్‌పేట నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.
Mahesh Kumar Goud: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు.
మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విప్లవాత్మక పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ రూ.5,200 కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారు. వాస్తవానికి అది బిల్లీ రావుతో కేటీఆర్ కుదుర్చుకున్న లంచం పద్దు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు.