Mahesh Kumar Goud: ‘పాలమూరు’పై సీఐడీ విచారణ కోరండి
ABN , Publish Date - May 23 , 2025 | 04:52 AM
కేటీఆర్‌కు ధైర్యముంటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైన సీఐడీ విచారణ లేదా న్యాయ విచారణ కోరాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
కేటీఆర్‌కు మహేశ్ గౌడ్ సవాల్
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌కు ధైర్యముంటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైన సీఐడీ విచారణ లేదా న్యాయ విచారణ కోరాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని.. విచారణ జరిగితే అవినీతి ఏ విధంగా జరిగిందన్నది బట్టబయలవుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వచ్చినట్లుగా, తాము నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. వాస్తవానికి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రె్‌సలో ఉన్నప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై పూర్తి ఆధారాలతో కేసు వేశారని, అయితే ఆయన్ను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని కేసును నీరుగార్చారని చెప్పారు.
బీఆర్‌ఎ్‌సలో ఉన్న నేత... బీఆర్‌ఎస్ పార్టీ అధినేతపై ఎలా కొట్లాడతారని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులతో కల్వకుంట్ల కుటుంబంలో ఆందోళన మొదలైందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరై.. తన నిజాయతీని నిరూపించుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News