• Home » Lok Sabha Election 2024 Live Updates

Lok Sabha Election 2024 Live Updates

Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్..

Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు.

LokSabha Elections: నోవాటెల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ

LokSabha Elections: నోవాటెల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు ఆదివారం సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్మ్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్  40 సీట్లకు మించి గెలవదు

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 40 సీట్లకంటే ఎక్కువ గెలువదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు.

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులు, మహిళలు, యూత్‌ టార్గెట్‌గా ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో... తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు.

Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!

Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballot) కోసం ఏప్రిల్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌(Hyderabad) పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయంలోని పన్వార్‌ హాల్‌లో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌..

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు.

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం.

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్

AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్

ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వాఖ్యానించారు. వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ

Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ

అంబేద్కర్ కోనసీమ జిల్లా నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉదయం 2.35 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో 2.50 గంటలకి ఈతకోట హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి