• Home » Lok Sabha Election 2024 Live Updates

Lok Sabha Election 2024 Live Updates

 VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌  బైబై

VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్‌ వీకే పాండ్యన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌. సికింద్రాబాద్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్‌ హోదా లభించగా, కరీంనగర్‌ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.

PM Modi: హుందాగా, అణకువగా  ఉండండి

PM Modi: హుందాగా, అణకువగా ఉండండి

మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు.

National : బీజేపీ కొత్త సారథి ఎవరు?

National : బీజేపీ కొత్త సారథి ఎవరు?

కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో బీజేపీలో సంస్థాగతంగా మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను క్యాబినెట్‌లోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిదాయకంగా మారింది.

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.

PM Modi : నేడే నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం

PM Modi : నేడే నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం

మోదీ 3.0 సర్కారు కొలువు తీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్‌ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని ..

Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు

Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు

ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.

నెహ్రూతో మోదీకి పోలికా?!: చిదంబరం

నెహ్రూతో మోదీకి పోలికా?!: చిదంబరం

నెహ్రూ మాదిరిగా తాను కూడా మూడోసారి వరుసగా ప్రధాన మంత్రి పీఠంలో కూర్చుంటున్నానన్న మోదీ వాదనను కాంగ్రెస్‌ ఖండించింది. నెహ్రూకు మోదీతో పోలిక ఏంటని ఆ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్‌ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్‌ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది.

BJP: నెహ్రూ సరసన మోదీ!

BJP: నెహ్రూ సరసన మోదీ!

వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి