Home » Latest News
అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారవేత్త అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహం గుండ్లపోచంపల్లికి చెందిన నేమారామ్ చౌదరిగా పోలీసులు గుర్తించారు.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు.
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) పరిధిలోకి వచ్చే క్రీడా ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. గత నెల 18న ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని డీడీఏ అధికారులు తెలిపారు. డీడీఏ క్రీడా ప్రాంగణాల్లో ఆదివారం ఒక్కరోజే 2.5 టన్నుల చెత్తను సేకరించామని చెప్పారు.
ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడిచేసిన తర్వాత విమానం ఇంజిన్లను షట్ డౌన్ చేసేందుకు యత్నించి ఉండవచ్చని ఇటలీ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొంది.
హైదరాబాద్ సిద్ధిక్ నగర్‌లో భవనం పైనుంచి పడి అస్సాం యువకుడు దిల్వార్ హుస్సేన్ మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.
యూకేలోని గ్లూసెస్టర్‌షైర్‌లో బ్రిటిష్ మిలిటరీ బేస్ రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌లో ఉన్న తన బీ1 బాంబర్లను అమెరికా స్వదేశానికి తరలించింది. ఆ బాంబర్లపై ఇరాన్ దాడికి పాల్పడేందుకు కుట్ర జరిపినట్లు అనుమానం రావడంతో అమెరికా వాటిని తన దేశానికి పంపింది.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఒకే ప్రాపర్టీ ఐడీ, ఒకే బిల్లు విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా అప్లై చేసుకోకుండానే ఆటోమేటిక్‌గా మ్యూటేషన్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు.