Home » Kodali Nani
Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు.! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీరాభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు షాకవుతున్నారు. ఇక అధికార వైసీపీ (YSR Congress) పెద్దలు అయితే సడన్‌గా ఏమిటిది.. అంటూ కంగుతిన్నారు. నాని మనసులోని మాటనే చెప్పారా..? లేకుంటే భయపడి ఇలా చెప్పారా..? ఇవన్నీ కాదు.. సింపతీ కోసమేనా..? అని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది..
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారని.. ఇప్పుడు రూ.370 కోట్ల రుణం ఎలా తెచ్చారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కొడాలి నానికి సడెన్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. నిజానికి అది ప్రేమ కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసైనికులను రెచ్చగొట్టే కార్యక్రమం. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని ఇవాళ ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని.. ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు.
AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
Andhrapradesh: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని సీఎం జగన్‌ని ఢీ కొట్టాలని చూసినా నిరూపయోగమేనని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్‌కు కొడాలి కౌంటర్ ఇచ్చారు.
Kodali Nani Vs YS Jagan: గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ (Gudivada) నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారా..? ఇందుకు ఇటీవల జరిగిన ఒకట్రెండు పరిణామాలే బలం చేకూరుస్తున్నాయా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..
కల్లు తాగిన కోతిలా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాగుతున్నారని జనసేన నేత పోతిన మహేష్ (Potina Mahesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారంటూ ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ హై కమాండ్‌పై అసంతృప్త నేతలు వరుసగా తిరుగుబాపుటా ఎగురవేస్తున్నారు.