Home » Kodali Nani
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
Andhrapradesh: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.
సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ( CM YS Jagan ) ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
Andhrapradesh: గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ నాయకుడు షేక్ మౌలాలి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శనివారం గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పార్టీలో చేశారు. మౌలాలికి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. మౌలాలితో పాటు అతని అనుచురులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గుడివాడ పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) హారతి పట్టేవారికి బహిరంగంగానే రూ.1,000 పళ్లెంలో వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా హారతి పళ్లెంలో డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరుగుతోంది.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోడంతో ప్రజలు వైసీపీ (YCP) నాయకులపై ఎదురుతిరుగుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించు కోకపోవడంతో.. ఎన్నికల వేళ ప్రజలు తమ బాధను బహిరంగంగా తెలియజేస్తున్నారు
మహిళా వలంటీర్‌తో మాజీ మంత్రి కొడాలి నాని కాళ్లు కడిగించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడివాడలో మహిళలతో కాళ్లపై కొడలి నాని పాలాభిషేకం చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. ముఖానికి ముసుగేసుకుని మరీ సదరు మహిళ వలంటీర్ కొడాలి నాని కాళ్లు కడిగింది.
Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్!. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిగో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) అయితే ‘నా రూటే సపరేటు’ అన్నట్లుగా నడుస్తున్నారు!. చుట్టూ వంద మంది భజన బృందం.. ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి..
టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై నేడు ఆయన స్పందించారు. మీడియాతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.