Home » Kishan Reddy G
దేశ ప్రజల ఆర్థిక సాధికారత, ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేందుకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఎంతగానో ఉపయోగపడిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. భారత హోమ్ మంత్రిత్వ శాఖ దీనిపై మానిటరింగ్ చేస్తుందన్నారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సైనికులు, భద్రతా సిబ్బంది వీరోచిత పోరాటంతో దేశ గౌరవాన్ని పెంచారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, వాస్తవాలను దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్ర రాజధానిలో కనీస రోడ్ల సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పార్కులను రక్షించడం వంటి పనులు చేపట్టకపోవడంతో ప్రజల జీవితం నరకప్రాయంగా మారిందని అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎవరడిగారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
జేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని సహా దేశంలో ఏ రాజకీయ నేత అయినా 30 రోజులు జైల్లో ఉంటే వారు పదవి నుంచి దిగిపోయేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి వ్యతిరేకత వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు అందరికీ వర్తిస్తుందని.. కానీ, కాంగ్రెస్ మాత్రమే ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదంటూ చురకలంటించారు.