Home » Kejriwal
హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.
యమునా నది ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇందుకు సంబంధిచిన ఒక వీడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి విపక్షాల ఐక్యతా యత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ వచ్చేవారం ఏర్పాటు చేయనున్న విపక్షాల ఐక్యతా సమావేశంలో 'ఆప్' అధినేత కేజ్రీవాల్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది.
ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ (DERC) చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని జూలై 11 వరకు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు ముడుపులు అందాయని, 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో...
ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారంనాడు సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన అధికారిక బంగళా ఆధునీకరణ, పునర్నిర్మాణ కార్యకలాపాల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని CAGను కోరింది.