• Home » Kavitha Arrest

Kavitha Arrest

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి..

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.

Sukesh Chandrasekhar: కవిత, కేజ్రీవాల్‌లకు చుక్కలు చూపిస్తున్న సుఖేష్!

Sukesh Chandrasekhar: కవిత, కేజ్రీవాల్‌లకు చుక్కలు చూపిస్తున్న సుఖేష్!

సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandra Sekhar).. ఈ పేరు వినిపించినా, మనిషి కనిపించినా.. ఇక లేఖలు బయటికొస్తే అదొక సంచలనమే! అరెస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలతో వార్తల్లో నిలిచారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సత్యేంద్ర జైన్‌లకు అయితే జైల్లో నుంచే సుఖేష్ చుక్కలు చూపిస్తున్నాడు!.

Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు వార్నింగ్.. అసలేం జరిగిందంటే..!?

Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు వార్నింగ్.. అసలేం జరిగిందంటే..!?

BRS MLC Kavitha: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్‌రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు..

Delhi Liquor Scam: కవిత రిమాండ్ అప్లికేషన్‌లో సీబీఐ ఏం చెప్పిందంటే...

Delhi Liquor Scam: కవిత రిమాండ్ అప్లికేషన్‌లో సీబీఐ ఏం చెప్పిందంటే...

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నేటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సీబీఐ కోరింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు అంటే ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే...14 రోజులు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ రిమాండ్ అప్లికేషన్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని అందులో పేర్కొంది.

Delhi Liquor Case: ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు కోర్టు ముందుకు..

Delhi Liquor Case: ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు కోర్టు ముందుకు..

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో సోమవారం ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

తెలంగాణలో వ్యాపారం చేయలేవ్‌

తెలంగాణలో వ్యాపారం చేయలేవ్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారుల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సీబీఐ పేర్కొంది...

సీబీఐ కస్టడీకి కవిత

సీబీఐ కస్టడీకి కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న కవితను మూడు రోజులు కస్డడీకి తీసుకుని విచారించేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది....

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam Case) అరెస్టై.. తిహాడ్‌(Tihar) జైల్లో ఉన్న కవితను(Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)(CBI) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు(Anil) తెలిపింది. ఆమె అరెస్టును సవాల్‌ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులోని(Rouse Avenue Court) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..

Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..

సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి