Home » Karnataka
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన జంబూసవారికి రాచనగరి సిద్ధమవుతోంది. గురువారం మధ్యాహ్నం జంబూసవారి వేడుకలు జరగనున్నాయి. వందలాది కళాబృందాలు, అశ్వదళం సాగుతుండగా గజరాజుల ఊరేగింపు జంబూసవారిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
మైసూరు దసరా ఉత్సవాల్లో ఈసారి డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాముండేశ్వరి విద్యుత్ సరఫరా కంపెనీ (సెస్క్) ఆధ్వర్యంలో బన్నిమంటప మైదానంలో ఆదివారం డ్రోన్ షో ప్రారంభమైంది. సుమారు 3వేల డ్రోన్‌లను ఉపయోగించి కొత్త లోకాన్ని సృష్టించారు.
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
రాయచూరు తాలూకాలోని డొంగరాంపూర్ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది.
భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్‌లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు.
ఇంటికి తిరిగి వచ్చిన జయమ్మ, భీమవ్వ రక్తం మడుగులో పడి ఉన్న పిల్లల్ని చూసి షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లలు చనిపోవటంతో వారి గుండెలు బద్దలయ్యాయి. గుండెలు అవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు.
గత కొద్దిరోజుల నుంచి కాలేజీకి వెళ్లటం లేదు. ఇక, సతీష్ ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
కులగణన సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికమేని కర్ణాటక హైకోర్టు తాజాగా పేర్కొంది. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మీకు కారు ఉందా..? బాడుగకు ఇవ్వాలనుకుంటన్నారా? నాకు చెప్పండి. చాలా పెద్దపెద్ద కంపెనీల వారితో పరిచయం ఉంది. నేను అందులో మీ కారును బాడుగకు పెట్టిస్తాను. మీకు నెలనెలా రెంట్ ఇప్పిస్తానని కారు యజమానులను నమ్మిస్తాడు.
స్వాతి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామంటూ సూర్య ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది.