Home » Kalvakuntla kavitha
తెలంగాణలో దస్ పర్సంటేజ్ సర్కార్ నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, పర్సంటేజీల పాలన నడుస్తోందని, పర్సంటేజీలు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరవుతున్నాయని ఆమె ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కుమార్ తమ్ముడు అరుణ్‌కుమార్ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు అందింది.
కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ ముగ్గురూ కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒకే బిల్లు ప్రవేశపెడితే సరిపోదని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు వేర్వేరుగా మూడు బిల్లులు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
‘బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతోంది. మేం కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. అధికారంలోకి రాగానే అంతకు అంతా తిరిగి చెల్లిస్తాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇప్పటివరకు రూ.35,000 రేవంత్ సర్కార్ బాకీ పడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలన ఐఫోన్‌లా ఉంటే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలన చైనా ఫోన్‌ను తలపిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జ
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్ర అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో ప్రణాళిక రూపొందించి అమలుకు కృషి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
పాలమూరు ఎత్తిపోతలను 14 నెలలుగా రేవంత్ సర్కారు కోల్డ్‌స్టోరేజీలో పెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరుకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
జనగణన ఇంకెప్పుడు ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కావాలనే కేంద్రం జనగణనను విస్మరిస్తోందంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.